jagan: నిజంగానే కరోనా వచ్చిందా? లేక జగన్ కు దూరంగా ఉండేందుకు అలా చెప్పారా?: విజయసాయిపై టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ అనుమానాలు
- కరోనా కట్టడిలో విశాఖ యంత్రాంగం విఫలమైంది
- కరోనాను జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదు
- కరోనా కేంద్రాల్లో సదుపాయాలు దారుణంగా ఉన్నాయి
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనకు కరోనా సోకడంపై విశాఖ సౌత్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అనుమానాలను వ్యక్తం చేశారు. విజయసాయికి కరోనా వచ్చిందో? లేక జగన్ కు దూరంగా ఉండేందుకు కరోనా వచ్చిందని చెపుతున్నారో? అని సందేహాన్ని వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో విశాఖ జిల్లా యంత్రాంగం విఫలమయిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నారా? లేరా? అనే డౌట్ కలుగుతోందని చెప్పారు. కరోనాను జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శించారు. సీఎం నిర్లక్ష్యం వల్లే కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పారు. కరోనా కేంద్రాల్లో సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.