Sekhar Kammula: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని లైవ్ ఇంటర్వ్యూ చేయాలని శేఖర్ కమ్ముల నిర్ణయం
- ప్రజల్లో కరోనా పట్ల అపోహలున్నాయన్న శేఖర్ కమ్ముల
- మెరుగైన అవగాహన అవసరం అంటూ వ్యాఖ్యలు
- ఈ సాయంత్రం ఫేస్ బుక్ లో అవగాహన కార్యక్రమం
కరోనా వైరస్ గతంలో ఎప్పుడూ రాని నేపథ్యంలో దీని వ్యాప్తి గురించి, కరోనా రోగుల గురించి సామాన్య ప్రజానీకంలో స్పష్టమైన అవగాహన అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల భావిస్తున్నారు. అందుకే ఆయన కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న కొండల్ అనే వ్యక్తిని లైవ్ లో ఇంటర్వ్యూ చేయాలని సంకల్పించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
"కరోనాతో మనం చేసే పోరాటంలో అనేక భయాలు, అపోహలు, తప్పుడు సమాచారం కారణంగా అనవసరమైన ఆందోళన, కంగారు, ఒత్తిడి కలుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే కరోనా నుంచి కోలుకున్న కొండల్ గారితో ఈ రోజు ఫేస్ బుక్ లో సాయంత్రం 6 గంటలకు లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను" అంటూ వెల్లడించారు.