Priests: కరోనా నుంచి కోలుకున్న తిరుమల అర్చకులు
- కరోనా బారిన పడిన 17 మంది శ్రీవారి అర్చకులు
- 16 మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు
- కోలుకుంటున్న పెద్ద జియ్యంగార్
ఇటీవల కరోనా బారినపడిన తిరుమల శ్రీవారి అర్చకులు ఆ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నారు. శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించిన తర్వాత టీటీడీలో కూడా కరోనా కలకలం మొదలైంది. 100కి పైగా సిబ్బందికి కరోనా సోకింది. 17 మంది శ్రీవారి అర్చకులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వారిలో 16 మంది పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు వారిని క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జి చేశారు. వారు మరో 10 రోజుల తర్వాత విధుల్లో చేరనున్నారు.
అటు, ఆలయ పెద్ద జియ్యంగార్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో పెద్ద జియ్యంగార్ల ఆరోగ్య పరిస్థితిపై తొలుత ఆందోళన నెలకొన్నా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్న వార్తతో ఆలయ వర్గాల్లో హర్షం నెలకొంది.