Rajasthan: 13 ఏళ్ల విద్యార్థినిపై ఏడాదిగా ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం

Teachers gang raped 13 year school girl in Rajasthan
  • రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో దారుణం
  • 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు
  • నిందితులకు సహకరించిన ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసులు
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పాఠశాల మేనేజర్, ఉపాధ్యాయులతోపాటు ఇతర సిబ్బంది బాలికపై ఏడాదిగా  అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 13 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిపై పోక్సో సహా భారత శిక్షా స్మృతిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసులు నమోదయ్యాయి.
Rajasthan
girl
Gang rape
Teachers

More Telugu News