Unlock 3: ఆగస్టు 1 నుంచి దేశంలో అన్‌లాక్-3 ప్రారంభం.. పాఠశాలలకు అనుమతి నిల్!

Unlock 3 starts from august 1st in India

  • ఈ నెలాఖరుతో ముగియనున్న అన్‌లాక్-2
  • అన్‌లాక్‌-3లో సడలింపులపై కేంద్రం చర్చ
  • పాఠశాలలతోపాటు మెట్రో సేవలకు కూడా అనుమతి నిల్?

ఈ నెలాఖరుతో అన్‌లాక్-2 ముగియనుండడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్‌లాక్-3 మొదలుకాబోతోంది. ఈసారి ఏయే రంగాలకు అనుమతి ఇవ్వాలన్న దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. నిజానికి అన్‌లాక్-3లో పాఠశాలలకు అనుమతిచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలకు అనుమతి ఇవ్వడం సరికాదన్నది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే, మెట్రో సేవలు తిరిగి ప్రారంభించేందుకు కూడా అనుమతి లభించకపోవచ్చని సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ అన్‌లాక్-3లో పాఠశాలలు, మెట్రోలకు అనుమతి లభించే అవకాశం లేదన్నారు.

కాగా, దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ 68 రోజుల తర్వాత మే 31తో ముగిసింది. కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జూన్ 1వ తేదీ నుంచి దేశంలో అన్‌లాక్-1 మొదలైంది. జులై 1 నుంచి ప్రారంభమైన అన్‌లాక్-2 ఈ నెల 31తో ముగియనుంది. ఈ రెండు విడతల్లోనూ పలు రంగాలకు సడలింపులు ఇచ్చిన కేంద్రం ఆగస్టు 1 నుంచి లాక్‌డౌన్-3ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News