Yanamala: రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం: యనమల
- రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే అప్పుల భారం
- 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాలి
- ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది
- ఏపీలో రివర్స్ టెండరింగ్, రివర్స్ గ్రోత్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే చేసిన అప్పుల కారణంగా.. 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని తెలిపారు.
వైసీపీ నేతల అసమర్థ పాలన కారణంగా ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఈ కారణాల వల్ల రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నట్లు చెప్పారు. ఏపీలో రివర్స్ టెండరింగ్, రివర్స్ గ్రోత్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ఆయన చురకలంటించారు.
ఏపీలో భూముల వేలాన్ని బిల్ట్ ఏపీ మిషన్ అని పేర్కొనడం కన్నా బిల్ట్ వైసీపీ మిషన్ అని పేర్కొనడం సబబని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో తప్పొప్పులను సమీక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.