Uttar Pradesh: బీజేపీ నేత సెక్స్-ట్రాఫికింగ్ రాకెట్.. ఫాంహౌస్‌పై దాడిచేసిన ఆగ్రా పోలీసులు

Agra Police busts sex trafficking racket operating from BJP leaders farmhouse
  • అమ్మాయిలను తీసుకొచ్చి హోటళ్లు, విటుల వద్దకు పంపిస్తున్న ముఠా
  • బీజేపీ నేత ఫాం హౌస్ వేదికగా దందా
  • తనకు సంబందం లేదన్న బీజేపీ నేత
యూపీ బీజేపీ నేత, ఆ పార్టీ ఆగ్రా జిల్లా మాజీ అధ్యక్షుడి ఫాంహౌస్‌పై దాడిచేసిన ఆగ్రా పోలీసులు పెద్ద ఎత్తున నడుస్తున్న సెక్స్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. అమ్మాయిల బుకింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న సచిన్, విశాల్, గోయల్‌తోపాటు విజయ్, రణ్‌వీర్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ముఠాలో కొందరు ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆగ్రా ఎస్సెస్పీ బబ్లూకుమార్ తెలిపారు. అమ్మాయిలను తొలుత ఫామ్‌హౌస్‌కు తీసుకొస్తారని, ఆపై వివిధ హోటళ్లతోపాటు విటుల వద్దకు పంపిస్తారని వివరించారు. ముగ్గురు మహిళలు సహా మొత్తం తొమ్మిది మందిని విచారిస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని బబ్లూ కుమార్ తెలిపారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత మాట్లాడుతూ.. ఆ ఫాంహౌస్ తనదే అయినా సచిన్, విష్ణు, గోయల్‌కు ఎప్పుడో లీజుకు ఇచ్చేశానని, అక్కడ జరుగుతున్న దానితో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారితో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆరోపించారు.
Uttar Pradesh
Agra
sex-trafficking racket
BJP leader
farmhouse

More Telugu News