Pawan Kalyan: హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా రికార్డు... పవర్ స్టార్ ను అధిగమించిన టాలీవుడ్ ప్రిన్స్!

Mahesh Babu Creates Record OverPawan Kalyan
  • సోషల్ మీడియాలో పోటీ పడుతున్న ఫ్యాన్స్
  • పవన్ పుట్టిన రోజు సందర్భంగా 2.7 కోట్ల ట్వీట్స్
  • 'హ్యాపీ బర్త్ డే మహేశ్'పై 3 కోట్ల ట్వీట్స్
మామూలుగా బాక్సాఫీస్ వద్ద మూవీ కలెక్షన్స్ విషయంలో అగ్రహీరోల మధ్య పోటీ ఉంటుంది. తమ స్టార్ సినిమాకు ఇంత కలెక్షన్ వచ్చిందంటే, తమ స్టార్ కు ఇంత కలెక్షన్ వచ్చిందని ప్రకటించుకునేందుకు అభిమానులు పోటీ పడుతూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా నాలుగు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడటంతో, కలెక్షన్ల గురించి మాట్లాడే అవకాశం ఎవరికీ లేకపోయింది. ఇదే సమయంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించేందుకు పోటీ పడుతున్నారు.

ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దాటేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ 2.7 కోట్ల ట్వీట్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డు కొద్ది కాలంలోనే తుడిచిపెట్టుకుపోయింది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే జరుగనుండగా, ఆయన ఫ్యాన్స్ 'హ్యాపీ బర్త్ డే మహేశ్' అనే హ్యాష్ ట్యాగ్ ను అప్పుడే వైరల్ చేసేశారు. ఇది 3 కోట్ల ట్వీట్స్ ను దాటేసి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Pawan Kalyan
Mahesh Babu
Social Media
Hash Tag

More Telugu News