USA: వైట్ హౌస్ లో కరోనా కలకలం... ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు పాజిటివ్

US National Security Adviser tested corona positive

  • కరోనా బారినపడిన రాబర్ట్ ఓబ్రియన్
  • ఇటీవలే పారిస్ వెళ్లొచ్చిన ఓబ్రియన్
  • ట్రంప్ కు ఎలాంటి ముప్పు లేదన్న వైట్ హౌస్

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా కలకలం రేగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఓబ్రియన్ కు పాజిటివ్ అని తేలింది. దీనిపై వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్ లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని వెల్లడించింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశాయి.

అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కరోనా ముప్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News