Nara Lokesh: శిరోముండనం, కొట్టి చంపడం లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: నారా లోకేశ్

lokesh fires on ycp leaders

  • మాస్కు వేసుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపేశారు
  • ఇప్పుడు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు
  • నిష్పక్షపాతమైన ఎంక్వయిరీ జరగాలి
  • ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ వద్ద బైక్‌పై వస్తున్న దళిత యువకుడు ఎరిచర్ల కిరణ్‌కుమార్‌ను మాస్క్‌ పెట్టుకోలేదంటూ పోలీసులు కొట్టడంతో అతడు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యువకుడి కుటుంబంలోని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్.. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

'మాస్కు వేసుకోలేదని బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కిరణ్ ని కొట్టి చంపేశారు. ఇప్పుడు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిష్పక్షపాతమైన ఎంక్వయిరీ జరగాలి. శిరోముండనం, కొట్టి చంపడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News