Asaduddin Owaisi: ప్రధాని అయోధ్యలో భూమిపూజకు హాజరైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది: ఒవైసీ

Owaisi says if PM would attend Bhumi Pujan it will be breach of constitution

  • ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ
  • హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ!
  • లౌకిక వాదమే రాజ్యాంగానికి పునాది అంటూ ఒవైసీ ట్వీట్

ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమి పూజకు అధికారిక హోదాలో ప్రధాని హాజరైతే అది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని వ్యాఖ్యానించారు. తద్వారా ప్రధాని పదవి చేపట్టేటప్పుడు చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టేనని ట్వీట్ చేశారు. లౌకికవాదం భారత రాజ్యాంగానికి ప్రాథమిక పునాది అని ఒవైసీ తెలిపారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసిన సంఘటనను తాము మర్చిపోలేమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News