Ravi Kondala Rao: సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రావి కొండలరావు
- 600 చిత్రాల్లో నటించిన రావి కొండలరావు
- అనేక చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు
తెలుగు చిత్రసీమలో రచయితగా, నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రావి కొండలరావు (88) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయనను హైదరాబాదు బేగంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
చేయి తిరిగిన రచయితగా గుర్తింపు ఉన్న రావి కొండలరావు నటుడిగా అనేక చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు. ఆయన దాదాపు 600 సినిమాల్లో నటించారు. నాటి సూపర్ హిట్లయిన దసరా బుల్లోడు, తేనె మనసులు సినిమాల నుంచి నేటి తరంలో కింగ్, వరుడు, ఓయ్ వంటి చిత్రాల్లోనూ ఆయన నటించారు. గతంలో బృందావనం, భైరవద్వీపం, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యవహరించారు. రావి కొండలరావు అర్ధాంగి రాధా కుమారి కూడా తెలుగు నటిగా సుపరిచితురాలు. ఆమె ఎనిమిదేళ్ల కిందటే కన్నుమూశారు.