KCR: నాటి తరం ఉత్తమ నటుల్లో ఆయన కూడా ఉంటారు: రావి కొండలరావు మృతిపై కేసీఆర్ స్పందన

CM KCR conveys deep condolences on the demise of Ravi Kondala Rao
  • నటుడు, రచయిత రావి కొండలరావు మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలన్న సీఎం కేసీఆర్
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రావి కొండలరావు నాటి తరం ఉత్తమ నటుల్లో ఒకరని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు, చిత్ర పరిశ్రమ కూడా రావి కొండలరావు స్మృతులతో విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుకు గురైన రావి కొండలరావు హైదరాబాదు బేగంపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
KCR
Ravi Kondala Rao
Demise
Condolences
Tollywood

More Telugu News