Ex Army Officer: భార్య అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు.. రిటైర్డ్ మిలిటరీ అధికారి ఆవేదన! 

Locals of Eluru opposed  funerals of Ex military officers wifes funerals

  • ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన మిలిటరీ అధికారి
  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్న కుమారుడు
  • కరోనాతో చనిపోయిన భార్య అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

దేశాన్ని కాపాడుతున్న సైనికులకు యావత్ ప్రజానీకం ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. కానీ, కరోనా రక్కసి పుణ్యమా అని అన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేసిన తనకు... ఇంత వ్యథ అవసరమా అని ఒక మాజీ మిలిటరీ అధికారి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి దాపురించింది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని విద్యానగర్ లో ఓ రిటైర్డ్ సైనికాధికారి తన భార్యతో కలిసి ఉంటున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయన భార్య కరోనాతో చనిపోయారు. అయితే, ఏలూరు తంగెళ్లమూడి సమాధుల తోటలో అంత్యక్రియల కోసం ప్రొక్లెయిన్ తో అధికారులు గొయ్యి తీయించారు. ఒక ప్రత్యేక వాహనంలో ఆమె మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు.

అయితే శవాన్ని అక్కడ పూడ్చవద్దంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కార్యక్రమాన్ని ముగించారు. కానీ, జరిగిన పరిణామాలతో రిటైర్డ్ మిలిటరీ అధికారి చలించిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసిన తనకు చివరకు మిగిలిన బహుమానం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ప్రస్తుతం భారత వాయుసేనలో పని చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News