Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు భారీ జరిమానా విధించిన సీఈసీ
- అనుమతి లేకుండా 'పవర్ స్టార్' పోస్టర్ల ఏర్పాటు
- హైదరాబాద్ వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లు
- రూ. 88 వేల జరిమానా విధించిన అధికారులు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన ఏది చేసినా పతాక శీర్షికలకు ఎక్కాల్సిందే. 'నాకు ఇష్టమొచ్చినట్టు నేను తీస్తా... నాకు ఇష్టమొచ్చినట్టు నేను చేస్తా'... ఇది వర్మ రొటీన్ గా చెప్పే డైలాగ్. అయితే, ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోబోమని ఆయనపై సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా 'పవర్ స్టార్' పోస్టర్లను పెట్టడంపై కన్నెర్ర చేసింది.
ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పోస్టర్లకు సంబంధించి డీఆర్ఎఫ్, సీఈసీ పర్మిషన్ తీసుకోలేదని తనిఖీల్లో తేలింది. మరోవైపు ఈ పోస్టర్లపై అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో, అనుమతి లేని పోస్టర్లకు రూ. 88 వేల జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ కూడా పోస్టర్లకు సంబంధించి రూ. 4 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.