Sanchaita: 'ప్రసాద్' పథకం కింద 'సింహాచలం' దేవస్థానం ఎంపిక.. మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సంచయిత

  • దేశ వ్యాప్తంగా ఐదు దేవాలయాల ఎంపిక
  • గొప్ప క్షేత్రంగా అభివృద్ది చేసుకుందామన్న సంచయిత
  • ప్రధానికి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు థ్యాంక్స్  
సింహాచలం దేవస్థానాన్ని 'ప్రసాద్' పథకం కింద ఎంపిక చేసినందుకు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు ధన్యవాదాలు తెలిపారు. సింహాద్రి అప్పన్న భక్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె ట్వీట్ చేశారు.

ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఐదింటిని ఎంపిక చేశారని... వాటిలో సింహాచలం కూడా ఉండటం సంతోషకరమని చెప్పారు. అందరం కలిసి సింహాచలం ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేసుకుందామని ఆమె తెలిపారు. ఈ ట్వీట్ కు ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ లను ట్యాగ్ చేశారు.
Sanchaita
Simhachalam
Prasad Scheme

More Telugu News