Sushant Singh Rajput: సుశాంత్ ఖాతా నుంచి కోట్ల రూపాయలు మాయం... రియాపై అనుమానం వ్యక్తం చేసిన సుశాంత్ తండ్రి!

Sushant father KK Singh accuses Rhea Chakraborty
  • ఇప్పటికే పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన కేకే సింగ్
  • రూ.15 కోట్లను మూడు బ్యాంకులకు మళ్లించినట్టు ఆరోపణ
  • ఆ ఖాతాలు రియా, ఆమె సోదరుడివేనని వెల్లడి
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అంశం ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడంలేదు. సుశాంత్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ పాట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదులో నటి రియా చక్రవర్తిపై ఆరోపణలు చేశారు. తన కుమారుడు సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం అయ్యాయని, రియా, ఆమె సోదరుడు తీసుకుని ఉండొచ్చంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుశాంత్ ఖాతాలో రూ.17 కోట్లు ఉండగా, రూ.15 కోట్లు మూడు వేర్వేరు బ్యాంకులకు బదిలీ అయినట్టు తెలుస్తోందని వివరించారు. ఆ బ్యాంకు ఖాతాలు రియా, ఆమె సోదరుడివేనని తెలిపారు. దీనిపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీహార్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని, సుశాంత్ బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Sushant Singh Rajput
KK Singh
Rhea Chakraborty
Bank Account
Bollywood

More Telugu News