vanitha vijayakumar: రూ. 1.25 కోట్ల నష్టపరిహారం కోరుతూ నటి వనితకు నోటీసులు పంపిన దర్శకురాలు

Lakshmy Ramakrishnan demands 1 cr from Vanitha Vijayakumar
  • వనిత, లక్ష్మీరామకృష్ణన్ మధ్య కొనసాగుతున్న వివాదం
  • నోటీసులపై వెటకారంగా స్పందించిన వనిత
  • ఆమె బెదిరింపులకు తాను లొంగేరకం కాదన్న నటి
తన వ్యక్తిగత జీవితం గురించి తీవ్ర విమర్శలు చేసిన నటి వనితా విజయ్‌కుమార్‌కు నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ రూ. 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపారు. ఇందుకు సంబంధించిన నోటీసుల కాపీని చెన్నై, వడపళని మహిళా పోలీస్ స్టేషన్‌తోపాటు వడపళని అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌కు, చెన్నై మహిళా సంఘానికి అందించారు.

అయితే, లక్ష్మీ రామకృష్ణన్ నోటీసులపై వనిత కాస్తంత ఎగతాళిగా స్పందించారు. ఆ నోటీసు కోర్టు ద్వారా వచ్చింది కాదని పేర్కొన్నారు. ఆమె బెదిరింపులకు తాను లొంగిపోయే మనిషిని కానని, తాను కూడా ఆమెకు నోటీసులు పంపుతానని పేర్కొన్నారు.

నటి వనిత మూడో పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి మధ్య మొదలైన వివాదం రగులుతూనే ఉంది. వనిత ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. ఆమె మూడో పెళ్లిపై లక్ష్మీరామకృష్ణన్, కస్తూరి తీవ్ర విమర్శలు చేశారు. ఫలితంగా వనిత ఎదురుదాడికి దిగి, లక్ష్మీరామకృష్ణన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆమె వనితకు నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపారు.
vanitha vijayakumar
Lakshmy Ramakrishnan
kollywood

More Telugu News