Raghurama krishna raju: ఆగస్టు 5న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించండి: జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ

Narsapuram MP Raghu Rama Krishna Raju writes letter to AP CM Jagan
  • ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి మోదీ భూమి పూజ
  • రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో పూజలు, హోమాలు నిర్వహించాలంటూ లేఖ
  • ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ఎంపీ
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే ఆగస్టు 5న ఏపీలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

రామాలయ నిర్మాణానికి చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, కాబట్టి రాష్ట్రంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు, ప్రధాన మంత్రి చేస్తున్న భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం ప్రజల చిరకాల వాంఛ అని అందులో వివరించారు.  
Raghurama krishna raju
YSRCP
Jagan
Ayodhya Ram Mandir
Letter

More Telugu News