International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం మరో నెల పొడిగింపు
- ఆగస్టు 31 వరకు నిషేధం పొడిగింపు
- ఈ నిర్ణయం రవాణా విమానాలకు వర్తించదన్న డీజీసీఏ
- ఒప్పందం కారణంగా అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు మినహాయింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 31 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా నిషేధాన్ని మరో నెల పొడిగించారు. తాజా నిషేధం ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. ఈ నిషేధం కేవలం ప్రయాణికుల విమానాలకు మాత్రమే వర్తిస్తుందని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. తమ అనుమతి తీసుకున్న విమానాలకు, రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించబోదని వెల్లడించింది. అయితే, ఫ్రాన్స్, అమెరికా దేశాలతో ఒప్పందం కారణంగా ఆ రెండు దేశాలకు మాత్రం భారత్ నుంచి ప్రయాణికుల విమానాలు నడుస్తాయి. కాగా, ప్రస్తుతం భారత్ లో దేశీయ విమాన సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.