Rhea Chakraborty: 'సత్యమేవ జయతే..' అంటూ వీడియోలో కన్నీటిపర్యంతమైన రియా చక్రవర్తి

Rhea Chakraborty get into tears while talking in a video
  • నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటూ వ్యాఖ్యలు
  • మీడియాలో తనపై దారుణ కథనాలు వస్తున్నాయని వెల్లడి
  • లాయర్ల సూచన మేరకు మౌనంగా ఉంటున్నానని వివరణ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంలో ఇప్పుడందరి దృష్టి నటి రియా చక్రవర్తిపై పడింది. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ గా ప్రచారం అందుకున్న రియాపై సుశాంత్ తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు. సుశాంత్ ఖాతాలోని రూ.15 కోట్లు రియా లాగేసుకుని ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, సుశాంత్ పరిస్థితికి ఆమే కారణమంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై రియా చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. తన సందేశంతో ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. "నాకు దేవుడిపైనా, న్యాయ వ్యవస్థపైనా బలమైన నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో నాపై భయంకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటిపై స్పందించవద్దని మా లాయర్లు చెప్పడంతో మౌనంగా ఉంటున్నాను. సత్యమేవ జయతే" అంటూ వీడియో ముగించారు.
Rhea Chakraborty
Sushant Singh Rajput
Suicide
Video
Bollywood

More Telugu News