Britain: కరోనాకు మరో టీకా: బ్రిటన్ లో తొలి దశ ప్రయోగాలు విజయవంతం!

Britain ready to second phase Vaccine trials

  • తొలి దశలో కనిపించని దుష్ప్రభావాలు
  • రెండో దశ విజయవంతమైతే అక్టోబరు నాటికి టీకా
  • వచ్చే ఏడాది నాటికి సమర్థవంతమైన టీకా అందుబాటులోకి వస్తుందన్న అమెరికా

కొవిడ్-19ను తరిమికొట్టే టీకా తయారీ కోసం ప్రపంచం అలుపెరగక శ్రమిస్తున్న వేళ బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా ముందంజలో వుండగా.. బ్రిటన్ కే చెందిన ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీకా తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. దీంతో తర్వాతి దశ ప్రయోగానికి శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. తొలి దశలో ఆందోళన కలిగించే దుష్ప్రభావాలేమీ కనిపించలేదని పేర్కొన్న శాస్త్రవేత్తలు,  రెండో దశలో 300 మందిపై ప్రయోగించనున్నట్టు తెలిపారు. ఈ దశలో 75 ఏళ్ల పైబడిన వారు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే అక్టోబరులో వేలాదిమందికి టీకా ఇస్తామని వివరించారు.

బ్రిటన్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో టీకా పనిచేస్తోందా? లేదా? అన్నది నిర్ధారించడం కష్టమవుతోందని, కాబట్టి మరో చోట దీనిని పరీక్షించాలని భావిస్తున్నట్టు ప్రయోగం నిర్వహిస్తున్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న రాబిన్ షాటాక్ తెలిపారు. కాగా, కరోనా మహమ్మారిని సమర్థంగా అడ్డుకోగలిగే టీకా వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంధోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News