Vizag: విశాఖ రాజధాని ఎఫెక్ట్ ప్రారంభం.. భూముల విలువను 50 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదనలు!

AP Govt issues proposals to hike land value in Vizag

  • మూడు రాజధానులకు ఆమోదం తెలిపిన గవర్నర్
  • భూముల విలువను పెంచుతూ నిన్న సాయంత్రం ప్రభుత్వ ఉత్తర్వులు
  • భీమిలిలో ఎకరం ధర రూ. 3 కోట్లు

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే... విశాఖలో సందడి ప్రారంభమైంది. భూముల విలువను పెంచుతూ నిన్న సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో గరిష్టంగా 50 శాతం, కనిష్టంగా 5 శాతం భూముల విలువను పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. వ్యవసాయ భూముల విలువను కూడా పెంచబోతున్నారు. భీమిలి ప్రాంతంలోని వ్యవసాయ భూములను 50 శాతం, ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం పెంచనున్నారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్లో ఉంచారు.

ఈ రోజు నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి... 10వ తేదీ నుంచి కొత్త విలువను అమలు చేయనున్నారు. మరోవైపు, నెల రోజుల క్రితం నుంచే భూముల విలువను పెంచడంపై అధికారులు కసరత్తు చేశారని తెలుస్తోంది. పెరిగిన విలువతో భీమిలిలో ఎకరం భూమి ధర రూ. 3 కోట్లకు చేరనుంది.

  • Loading...

More Telugu News