Pawan Kalyan: షిప్ యార్డు మృతుల్లో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు... ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan demands permanent job for victims family members of Hindusthan Ship Yard

  • షిప్ యార్డు ప్రమాదంలో 11కి పెరిగిన మృతుల సంఖ్య
  • మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న పవన్
  • విశాఖలో వరుస ప్రమాదాలపై ఆందోళన

వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 ఈ ప్రమాదంలో మరణించినవారిలో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని తెలిసిందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి షిప్ యార్డు సంస్థ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎల్జీ పాలిమర్స్, సాయినార్, రాంకీ సెజ్ వంటి దుర్ఘటనలు కళ్ల ముందు మెదులుతుండగానే, క్రేన్ ప్రమాదం జరగడం విచారకరం అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News