Raghava Lawrence: చంద్రముఖి-2పై వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్: రాఘవ లారెన్స్

Raghava Lawrence clarifies on Chandramukhi two
  • చంద్రముఖి-2 తెరకెక్కించేందుకు లారెన్స్ సన్నాహాలు
  • జ్యోతిక, సిమ్రాన్, కియారా అంటూ పుకార్లు
  • త్వరలోనే ప్రకటిస్తామన్న లారెన్స్
కొరియోగ్రాఫర్ గా ప్రస్థానం మొదలుపెట్టి, ఆపై నటుడిగా, దర్శకుడిగానూ రాణిస్తున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి-2 తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ముఖ్యపాత్ర కోసం జ్యోతిక, సిమ్రాన్, కియరా అద్వానీల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై లారెన్స్ స్వయంగా వివరణ ఇచ్చాడు.

 చంద్రముఖిలో ఫిమేల్ లీడ్ రోల్ కు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయని, జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం చంద్రముఖి-2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ప్రధానపాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది తేలుతుందని స్పష్టం చేశాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ సోషల్ మీడియాలో తెలిపాడు.
Raghava Lawrence
Chandramukhi-2
Fake News
Jyothika
SImran
Kiara
Corona Virus

More Telugu News