Planes: అమెరికాలో రెండు విమానాలు ఢీ... రిపబ్లికన్ నేత సహా ఏడుగురి దుర్మరణం

Two planes collided in mid air as seven people died in USA
  • అలాస్కా సమీపంలో ప్రమాదం
  • కుప్పకూలిన విమానాలు
  • ఒక్కడే ఓ విమానంలో వెళుతున్న సెనేటర్ గ్యారీ నాప్
అమెరికాలో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో అలాస్కా స్టేట్ ప్రతినిధుల సభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు. 67 ఏళ్ల గ్యారీ నాప్ అలాస్కా నుంచి అమెరికా సెనేట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, నాప్ ఒక్కడే ఓ విమానంలో ప్రయణిస్తుండగా, అలాస్కా సమీపంలోని సోల్డోట్నా సిటీ ఎయిర్ పోర్టు వద్ద ప్రమాదం జరిగింది. మరో విమానం నాప్ ప్రయాణిస్తున్న విమానాన్ని గాల్లోనే ఢీకొట్టింది. ఈ ఘటనలో నాప్ తో పాటు, మరో విమానంలోని నలుగురు టూరిస్టులు, ఓ గైడ్, పైలెట్ మరణించారు. ప్రమాదం కారణంగా ఈ రెండు విమానాలు కుప్పకూలిపోయాయి.
Planes
Collision
USA
Gary Knopp
Alaska

More Telugu News