Software sharada: ‘సాఫ్ట్‌వేర్ శారద’కు టిటా చేయూత.. ఏఐపై ఉచిత శిక్షణ

TITA offers free AI course to Software sharada
  • ఉచితంగా ల్యాప్‌టాప్ అందించిన టిటా గ్లోబల్ ప్రెసిడెంట్
  • ఉచిత శిక్షణకు అవసరమైన పత్రాలు అందజేత
  • అండగా ఉంటామంటూ హామీ
కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయల వ్యాపారం చేస్తున్న ‘సాఫ్ట్‌వేర్ శారద’కు  తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. శనివారం ఆమెకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందించిన టిటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆమెకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఉచితంగా శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను ఆమెకు అందించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ సంస్థలో పనిచేసిన శారద.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం కోల్పోయినందుకు ఏమాత్రం దిగులు చెందకుండా కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన ఆమె తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
Software sharada
TITA
sadndeep maktala
software engineer

More Telugu News