Sanitiser: శానిటైజర్ మద్యంగా మారిన వేళ... వీడియో ఇదిగో!

Men drinks sanitiser instead of liquor in AP
  • మద్యం బదులు శానిటైజర్ తాగుతున్న మందుబాబులు
  • ఇటీవలే కురిచేడులో 13 మంది మృతి
  • తాజాగా కడప పట్టణంలో శానిటైజర్ తాగిన వ్యక్తులు
ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. మద్యం బదులు శానిటైజర్ తాగుతూ మృత్యువాత పడుతున్న వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఇటీవలే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 13 మంది మరణించారు. అయినప్పటికీ రాష్ట్రంలో శానిటైజర్ తాగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా కడప పట్టణంలో కొందరు వ్యక్తులు శానిటైజర్ లో నీళ్లు కలుపుకుని తాగడం దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. మద్యం కంటే శానిటైజర్ రేటు తక్కువగా ఉండడం, కిక్ ఎక్కువ వస్తుందన్న నమ్మకం... అల్పాదాయ వర్గాలను ఈ దిశగా నడిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Sanitiser
Liquor
Andhra Pradesh
Kurichedu
Prakasam District

More Telugu News