Nani: మారుతి దర్శకత్వంలో నాని మరో చిత్రం

Maruthi to direct Nani again
  • ఎటువంటి పాత్రనైనా ఈజీగా చేసే నాని 
  • ప్రస్తుతం నిర్మాణంలో 'వి', 'టక్ జగదీశ్'
  • పూర్తి స్క్రిప్టు సిద్ధం చేస్తున్న మారుతి  
మనకున్న టాలెంటెడ్ హీరోలలో నాని ఒకరు. ఎటువంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు. పైగా, తన చిత్రాలలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. అలాంటి కథలనే ఎంచుకుంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓపక్క 'వి', మరోపక్క 'టక్ జగదీశ్' చిత్రాలలో నటిస్తున్న నాని..  టాలెంటెడ్ దర్శకుడు మారుతితో మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం.

కొన్నాళ్ల క్రితం నాని, మారుతి కాంబినేషన్లో 'భలే భలే మగాడివోయ్' చిత్రం వచ్చింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించడంతో మారుతితో మరో సినిమా చేయాలని నాని భావిస్తూ వచ్చాడు. అయితే, ఇన్నాళ్లకు కథ సెట్ అయినట్టు చెబుతున్నారు. తాజాగా మారుతి వినిపించిన కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో మారుతి వున్నట్టు, దీనిని పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నట్టు తెలుస్తోంది.  
Nani
Maruthi
Bhale Bhale Magadivoy
Tuck Jagadish

More Telugu News