Prabhas: ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్?

AR Rehman to compose music for Prabhas movie
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ చిత్రం 
  • హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపిక
  • రెహ్మాన్ కి భారీ పారితోషికం ఆఫర్
ప్రభాస్ ఇమేజ్ ఒక్కో చిత్రానికీ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్టు కూడా విస్తృతం అవడంతో సినిమా బడ్జెట్టు కూడా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం తను నటించే 21వ చిత్రం కూడా అలాగే అందరినీ ఆకట్టుకుంటోంది. 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొణే నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో ఈ చిత్రం రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

అందుకు తగ్గట్టుగానే మరిన్ని విశేషాలను ఈ చిత్రానికి జోడిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం కోసం భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసి రెహ్మాన్ ని తీసుకున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈచిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. సినిమా విస్తృతి దృష్ట్యా మిగతా పాత్రలకు కూడా పలు భాషల నుంచి ప్రముఖ నటులను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.      
Prabhas
Deepika Padukone
AR Rehman
Nag Ashwin

More Telugu News