Nara Lokesh: జెండా మాస్టారు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను: నారా లోకేశ్
- ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా జీవించారు
- మచిలీపట్నం పోర్టు నిర్మాణ ఉద్యమానికి ఆద్యుడు
- రాజకీయాలకు అతీతంగా ప్రజల మనసులు గెలిచారు
- మచిలీపట్నం అభివృద్ధిలో ఆయన సజీవంగా ఉంటారు
ఆంధ్రప్రదేశ్‌లో జెండా మాస్టారుగా పేరు పొందిన నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్ (85) నిన్న రాత్రి అనారోగ్యంతో తన ఇంట్లో మృతి చెందారు. ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు. రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. బందరు పోర్టు నిర్మించాలని 300 రోజులకు పైగా చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సారధ్యం వహించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ సంతాపం తెలిపారు.
'ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా జీవించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ ఉద్యమానికి ఆద్యుడు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మనస్సు గెలిచిన నిడుమోలు ప్రసాద్ (జెండా మాస్టారు) మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. మాస్టారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జెండా మాస్టారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మచిలీపట్నం అభివృద్ధిలో ఆయన ఎప్పుడూ సజీవంగా ఉంటారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.