Vangapandu prasada rao: ప్రజాకవి వంగపండు ప్రసాదరావు కన్నుమూత

folk artist Vangapandu prasada rao passes away

  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు
  • 1972లో జననాట్య మండలి స్థాపన
  • అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటారన్న గద్దర్

ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన  ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు.

వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు  2017లో కళారత్న పురస్కారం లభించింది. వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News