Perni Nani: ఆ రాజీనామాలు ఏవో మీరే చేసి రండి... ప్రజాక్షేత్రంలో చూసుకుందాం: చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

Perni Nani challenges Chandrababu and ask resignations of TDP members
  • 48 గంటల్లో అసెంబ్లీ రద్దు చేయాలన్న చంద్రబాబు
  • రాజధానిపై ఎన్నికలకు వెళదాం అంటూ సర్కారుకు సవాల్
  • చంద్రబాబుకు అధికారం రాదన్న భయం పట్టుకుందన్న పేర్ని నాని
రాజధాని అంశంపై 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్ చేయగా, వైసీపీ నేతలు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, నాడు భూములు ఇచ్చిన అమరావతి రైతులకు కౌలు ఇవ్వకుండా వాళ్లకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. జగన్ వద్ద నుండి ఎప్పటికీ అధికారం రాదేమోనన్న భయంతో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ రాజీనామాలు ఏవో మీరే చేసి రండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Perni Nani
Chandrababu
Resignation
Telugudesam
Amaravati
AP Capital
YSRCP
Andhra Pradesh

More Telugu News