Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 748 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
- 211 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఏడున్నర శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను ముందుండి నడిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 748 పాయింట్లు పెరిగి 37,688కి ఎగబాకింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 11,102కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (7.54%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.80%), మారుతి సుజుకి లిమిటెడ్ (3.30%), యాక్సిస్ బ్యాంక్ (2.79%), హీరో మోటోకార్ప్ (3.80%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.88%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.07%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.93%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.07%), ఇన్ఫోసిస్ (-0.63%).