Andhra Pradesh: ఏపీ 'మూడు రాజధానుల'పై స్టేటస్ కో ..హైకోర్టు ఆదేశాలు!
- మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై యథాతథ స్థితి
- 10 రోజుల పాటు స్టే విధించిన ధర్మాసనం
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్ ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు... గెజిట్ పై స్టేటస్ కో (యథాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది. రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు చట్టంపై స్టేటస్ కో విధించింది. 10 రోజుల పాటు యథాతథ స్థితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.