Balineni Srinivasa Reddy: త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తా.. ఎవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి బాలినేని

Balineni Srinivasa Reddy tests positive with Corona
  • మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్
  • హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానన్న బాలినేని
ఏపీలో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలినేని స్పందించారు. తనకు కరోనా సోకిందని చెప్పారు. అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని... ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. పూర్తిగా  కోలుకుని త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు.
Balineni Srinivasa Reddy
YSRCP
Corona Virus

More Telugu News