Rhea Chakraborthy: సినీనటి రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసిన ఈడీ

ED issues summons to Rhea Chakraborthy
  • సుశాంత్ అకౌంట్ల నుంచి డబ్బు తరలిపోయిందని ఆరోపణలు
  • బీహార్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు
  • శుక్రవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు, సినీనటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 15 కోట్లను రియా ట్రాన్స్ ఫర్ చేసిందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బీహార్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రియాపై ఈడీ కేసు నమోదు చేసింది. రియాకు సమన్లు జారీ చేసింది. ఇతర అనుమానితులకు వచ్చే వారంలో సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
Bollywood
Enforcement Directorate

More Telugu News