Vijayasai Reddy: ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదు.. లక్ష కోట్లే కావాలంటున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి సెటైర్

YSRCP MP Vijaya Sai Setires on Chandrababu

  • బినామీలతో భూములు కొనిపించిన చంద్రబాబు
  • 20 మంది ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదన్నట్టున్నారు
  • బాబు దృష్టిలో అమరావతే విలువైనదన్న విజయసాయి

మాజీ సీఎం చంద్రబాబునాయుడి దృష్టిలో అమరావతి ఎంతో 'విలువైనది' అంటూ, అక్కడ బినామీల పేరిట కొన్న భూములు లక్ష కోట్ల విలువైనవని, ఆ లక్ష కోట్లే కావాలని ఆయన అంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా.. అన్న ప్రశ్నకు, ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు. బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది" అని అన్నారు.

  • Loading...

More Telugu News