Facebook: డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టును తొలగించి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్‌

Facebook Pull Trump Posts Over Coronavirus Misinformation
  • కరోనాను ఎదుర్కొనే శక్తి చిన్నారుల్లో ఉంటుందన్న ట్రంప్
  • ఓ వీడియో పోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు
  • తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారన్న ఫేస్‌బుక్
కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో తమ సైట్‌లో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటోంది. అటువంటి సమాచారం తమ దృష్టికి వస్తే వాటిని సైట్‌ నుంచి తొలగిస్తోంది. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది.

ట్రంప్‌ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందని చెప్పారు. అయితే, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

అయితే, ఇది  క‌రోనా వైర‌స్ ప‌ట్ల జరుగుతోన్న త‌ప్పుడు ప్ర‌చారమని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇది తమ పాలసీలను ఉల్లంఘించడమే అవుతుందని, కొవిడ్‌-19 గురించి ఇచ్చిన ఈ సమాచారం హానికరమని ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. ఇందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది.
Facebook
Donald Trump
Corona Virus

More Telugu News