Sensex: కీలక రేట్లను మార్చని ఆర్బీఐ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets ends in profits

  • 362 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడ్డ టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈనాటి మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేట్లను (రెపో, రివర్స్ రెపో) ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 362 పాయింట్లు లాభపడి 38,025కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 11,200 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.82%), ఇన్ఫోసిస్ (2.60%), బజాజ్ ఫైనాన్స్ (2.54%), టీసీఎస్ (2.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.11%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.48%), ఎల్ అండ్ టీ (-0.44%), యాక్సిస్ బ్యాంక్ (-0.43%), బజాజ్ ఆటో (-0.35%).

  • Loading...

More Telugu News