Balineni Srinivasa Reddy: నా ఆరోగ్యంపై ఆందోళన వద్దు: ఏపీ మంత్రి బాలినేని

Balineni says that he is doing fine
  • బాలినేనికి కరోనా పాజిటివ్
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • త్వరలోనే కోలుకుని వస్తానని బాలినేని ధీమా
ఏపీ ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. త్వరలోనే కోలుకుని ప్రజాసమస్యల పరిష్కారానికి పునరంకితం అవుతానని తెలిపారు. కాగా, బాలినేని ప్రస్తుతం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వైసీపీ ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారినపడుతున్నారు.
Balineni Srinivasa Reddy
Corona Virus
Positive
Apollo
Hyderabad

More Telugu News