GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో తగ్గుతూ.. జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

2256 corona cases registered in telangana last 24 hours

  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 2,256 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 464 కేసులు
  • వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్ జిల్లాల్లో వందకుపైగా కేసుల నమోదు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నిన్న కొత్తగా  2,256 కేసులు నమోదు కాగా,  14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 77,513కు పెరగ్గా, 615 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇంకా 22,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 15,830 మంది హోం క్వారంటైన్, వ్యవస్థాగత ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

తాజాగా వెలుగు చూసిన కేసుల్లో 464 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా వరంగల్ అర్బన్‌ (187), రంగారెడ్డి (181), మేడ్చల్ మల్కాజిగిరి (138), కరీంనగర్‌ (101)లలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక, నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 23,322 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,90,306కు పెరిగింది.

.

  • Loading...

More Telugu News