Indian Hockey Team: భారత హాకీ జట్టు కెప్టెన్ తో పాటు మరో ముగ్గురికి కరోనా

Indian Hockey captain and 3 other players tests with Corona virus
  • బెంగళూరు క్యాంపస్ లో శిక్షణలో ఉన్న హాకీ జట్టు
  • ఒలింపిక్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆటగాళ్లు
  • త్వరలోనే  కోలుకుంటామన్న కెప్టెన్ మన్ ప్రీత్
భారత హాకీ జట్టులో కరోనా కలకలం రేగింది. హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ తో పాటు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం భారత హాకీ జాతీయ జట్టు బెంగళూరులో ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ కోసం ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు.

కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉన్న ఆటగాళ్లు ఇటీవలే బెంగళూరులోని క్యాంపుకు వచ్చారు. క్యాంపుకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వీరంతా నిర్బంధంలో ఉన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించగా తొలుత అందరికీ నెగెటివ్ వచ్చింది. శిక్షణ ప్రారంభమైన తర్వాత మళ్లీ టెస్టులు నిర్వహించగా... నలుగురికి పాజిటివ్ వచ్చింది. కెప్టెన్ మన్ ప్రీత్ తో పాటు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, వరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.

ఈ సందర్భంగా మన్ ప్రీత్ మాట్లాడుతూ, ఎస్ఐఐ క్యాంపస్ లో స్వీయ నిర్బంధంలో ఉన్నానని తెలిపాడు. త్వరలోనే అందరం కోలుకుంటామని చెప్పాడు.
Indian Hockey Team
Corona Virus
Bengaluru

More Telugu News