flight accident: విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
- నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించనున్న అధికారులు
- బయటకు రానున్న పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు
- విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే ఛాన్స్
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా విమానం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు.
అందులోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ , కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లలో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా విమానం ఎంత ఎత్తులో ఉన్నదీ, ఎంత వేగం, ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు తెలియనున్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.