Mark Zuckerberg: కలిసొచ్చిన 'ఇన్ స్టాగ్రామ్ రీల్స్'... 100 బిలియన్ డాలర్లకు చేరిన జుకర్ బర్గ్ సంపద

Mark Zuckerberg wealth reaches hundred billion dollars
  • టిక్ టాక్ కు పోటీగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రంగప్రవేశం
  • రీల్స్ రాకతో పెరిగిన ఫేస్ బుక్ షేర్ విలువ
  • ఫేస్ బుక్ లో 13 శాతం వాటాలు కలిగివున్న జుకర్ బర్గ్
టిక్ టాక్ కు పోటీగా ఫేస్ బుక్ తన ఇన్ స్టాగ్రామ్ యాప్ లో తీసుకువచ్చిన వీడియో ఫీచర్ పేరే 'ఇన్ స్టాగ్రామ్ రీల్స్'. ఈ ఫీచర్ కు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫీచర్ పుణ్యమా అని ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లకు చేరింది.

 అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించే ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో 'ఇన్ స్టాగ్రామ్ రీల్స్' కు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలు ఫేస్ బుక్ షేర్ల విలువను 6 శాతం పెంచేశాయి. ఫేస్ బుక్ లో 13 శాతం వాటాలు కలిగివున్న మార్క్ జుకర్ బర్గ్ ఈ పరిణామాలతో బాగా లాభపడ్డారు. ఈ క్రమంలో ఆయన 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ రూపకర్త బిల్ గేట్స్ సరసన స్థానం సంపాదించుకున్నారు.
Mark Zuckerberg
Instagram Reels
Facebook
Share
TikTok

More Telugu News