Air Asia: రాంచీలో విమానానికి పక్షి తగలడంతో అత్యవసరంగా నిలిపివేత

Air Asia plane stopped immediately after a bird hit while take off

  • రాంచీ నుంచి ముంబయి వెళుతున్న విమానం
  • టేకాఫ్ సమయంలో విమానాన్ని తాకిన పక్షి
  • తనిఖీల అనంతరం గాల్లోకి ఎగరనున్న విమానం

కోజికోడ్ లో రన్ వే నుంచి పక్కకు జారిన విమానం లోయలో పడిన దుర్ఘటన యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచింది. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అప్రమత్తత కనిపిస్తోంది. తాజాగా రాంచీ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. విమానం ఈ ఉదయం టేకాఫ్ తీసుకుంటుండగా పక్షి తగిలింది. దాంతో విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పినట్టయింది. ఈ విమానం ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ముంబయి వెళ్లాల్సి ఉంది. కాగా, సాంకేతిక నిపుణులు విమానానికి మరోసారి తనిఖీలు నిర్వహించిన అనంతరం విమానం ముంబయి పయనమవుతుంది.

  • Loading...

More Telugu News