Rhea Chakraborthy: రియా, బాంద్రా డీసీపీ మధ్య ఫోన్ కాల్స్!

Calls between Rhea Chakraborthy and DCP Abhishek
  • రియా కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు
  • రియాకు కాల్స్ చేసిన బాంద్రా డీసీపీ
  • నిందితులందరితో డీసీపీ టచ్ లో ఉన్నారన్న పోలీసులు
సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖి ఆమెతో పలుమార్లు మాట్లాడినట్టు సమాచారం. రియాకు ఆయన రెండు సార్లు ఫోన్ చేసినట్టు... ఆయనకు రియా రెండు సార్లు కాల్ చేసినట్టు డేటాలో ఉంది. కాల్స్ తో పాటు రియాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఈ కాల్స్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సుశాంత్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అందరితోను అభిషేక్ టచ్ లో ఉన్నారని చెప్పారు.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
DCP
Bollywood

More Telugu News