Mukhesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్న ముఖేశ్ అంబానీ
- 80.6 బిలియన్ డాలర్లకు పెరిగిన ముఖేశ్ ఆదాయం
- బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను నాలుగో స్థానానికి నెట్టేసిన ముఖేశ్
- 187 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో జెఫ్ బెజోస్
భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి ఎగబాకారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 80.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముఖేశ్ నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ క్రమంలో లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే ఎల్వీఎంహెచ్ సంస్ష ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను ఆయన అధిగమించారు. ఇప్పటికే వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ఎలాన్ మస్క్ వంటి కుబేరులను ముఖేశ్ అధిగమించారు.
ప్రపంచ సంపన్నుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో ఉన్నారు. 121 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్, 102 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.