Fire Accident: అగ్నిప్రమాదంపై ఏపీ మంత్రుల సమీక్ష... మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు

AP Ministers reviews on fire accident in Vijayawada covid care center

  • విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం
  • 10 మంది మృత్యువాత
  • విచారణ కమిటీ ఏర్పాటు

విజయవాడలో ఈ ఉదయం ఓ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏపీ మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, కరోనా సెంటర్ లో ప్రమాదం జరగడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 18 మందిని రక్షించారని వెల్లడించారు. గాయపడిన మరో 15 మందికి రమేశ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు కమిటీ వేశామని ఆయన వివరించారు. కొవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేశ్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం ఉంటే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News