Nara Lokesh: ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి చావగొట్టారు: లోకేశ్

Lokesh questions YS Jagan government on latest issues related to dalits
  • దళితులపై సర్కారు వివక్ష పరాకాష్ఠకు చేరిందన్న లోకేశ్
  • మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ ట్వీట్
  • దళిత యువకుడు ప్రసాద్ కు న్యాయం చేయాలంటూ డిమాండ్
దళితుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వ వివక్ష పరాకాష్ఠకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు ప్రసాద్ నక్సలిజం వైపు వెళ్లాలి అనుకునే పరిస్థితి తీసుకువచ్చారని, ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి చావగొట్టారని వెల్లడించారు.

ఈ ఘటనకు కారకులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోగా, ప్రసాద్ పై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మీ నియంతృత్వ పోకడలను ప్రశ్నిస్తే దళిత ప్రజలను చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు. జరిగిన తప్పుకు ప్రభుత్వం తరఫున దళిత జాతికి క్షమాపణ చెప్పి ప్రసాద్ కు న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Nara Lokesh
Jagan
Dalits
YSRCP
Andhra Pradesh

More Telugu News